Friday, November 22, 2024

తెలంగాణ జాతీయ స్ఫూర్తిని ప్రతిబిం బించేలా స‌మైక్య‌త వ‌జ్రోత్స‌వాలు : మంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట : జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు తెలంగాణ జాతి స్పూర్తిని ప్రతిబింబించెలా వైభవంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి హ‌రీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆయ‌న మాట్లాడారు. జిల్లా ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింద‌న్నారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా జరుపుకున్నాం, ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా 15 రోజులపాటు జరుపుకున్నాం అన్నారు. దానికి కొనసాగింపుగానే సీఎం కేసీఆర్ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ తెలంగాణ జాతి స్పూర్తిని ప్రతిబింబించెల మూడు రోజుల పాటు వైభవంగా జరపాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది. ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోయాయి. నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను, ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత అన్నారు.

జాతీయ సమైక్యతా అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదు. ప్రజల మధ్య సమైక్యత అన్నారు.. విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత. దేశం అనుసరిస్తున్న జీవనసూత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తి అన్నారు.. 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించింది ఉద్యమ నేత కేసీఆర్‌ నేతృత్వంలో 14 ఏళ్ల పోరాటం , అమరుల త్యాగ ఫలితం, 4కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చి నేడు స్వరాష్ట్రమై అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ, అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది అన్నారు. సమైక్యాంధ్ర సంకెళ్ల నుండి విముక్తి పొందిన జూన్‌ 2వ తేదీన ప్రతీఏటా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అదే విధంగా భారత స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ సందర్భాల్లో మన జిల్లా ప్రగతి ప్రాభవాన్ని సందేశాత్మకంగా వివరించడం జరిగింది. నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను సైతం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నద‌న్నారు. ఈ కీలకమైన సందర్భంలోనూ జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరోసారి నెమరువేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాచరిక పాలన నుండి ప్రజాస్వామిక పాలనలో చేరి 74 సంవత్సరాలు గడిచాయి అన్నారు.. కానీ గడిచిన ఎనిమిదేళ్ల స్వరాష్ట్ర పాలనలోనే ఎన్నో లక్ష్యాలను చేరుకున్నాం. ఎన్నో అద్భుతాలను సృష్టించుకున్నాం అన్నారు.. నాలుగు దశాబ్దాల పైగా నాన్చివేతకు గురైన సిద్దిపేటకు జిల్లా హోదా దక్కడంతో పాటు పోలీస్‌ కమిషనరేట్‌ గా మారింద‌న్నారు. స్వరాష్ట్రం సిద్దించిన రెండేళ్లలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దిపేట ప్రజల చిరకాల వాంఛకు గొప్ప పరిష్కారం చూపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement