Wednesday, November 20, 2024

TS | ఏసీబీ వలలో ముగ్గురు అవినీతి అధికారులు…

(ప్రభ న్యూస్) : రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలానికి చెందిన వ్యవసాయ శాఖ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆగ్రో ఏజెన్సీ షాపు అనుమతి కోసం రూ.30 వేలు వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన సూర్యనారాయణ అనే రైతు నుంచి 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు లైన్‌మెన్ వేణు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వైర్లు లాగేందుకు లైన్‌మెన్ వేణు రైతు నుంచి లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రైతు సూర్యనారాయణ ఏసీబీని ఆశ్రయించగా.. ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా లైన్ మెన్ పట్టుకున్నారు.

అశ్వారావుపేటకు చెందిన ఎలక్ట్రికల్ ఏఈ శరత్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సరిహద్దు చెక్పోస్టు వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement