టమాటా సాగు చేసే రైతన్నలకు కష్టమొచ్చిపడింది. ధరలు భారీగా పడిపోవడంతో రైతన్నలు అయోమయంలో పడ్డారు. మొన్నటిదాకా కిలో టమాట రూ.20-30 వరకు పలికిన ధర.. నేడు 20 కేజీల బాక్స్ రూ.50 పలకడంతో టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీగా టమాటా ధరలు పడిపోయాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను తిరిగి తీసుకెళ్లలేక రోడ్డుపైనే పారబోస్తున్నారు. పంట పొలాల్లోనే పంటను వదిలేసిన మరికొందరు రైతులు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement