Thursday, November 21, 2024

అర్థరాత్రి అటవీశాఖ అధికారులపై ముప్పేట దాడి

పాప‌న్న‌పేట : అర్ధరాత్రి అటవీ ప్రాంతాన్ని నరికివేసి భూమిని చదును చేస్తున్న గ్రామస్తులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన అటవి శాఖ అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడి చితక బాదిన సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని నామాపూర్ గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధిత అటవీశాఖ అధికారి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాపన్నపేట మండలం పరిధి అన్నారం బీట్ పరిధిలోని నామాపూర్ గ్రామ శివారులో 70వ కంపార్ట్మెంట్ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల అటవీ భూమిలోని మొక్కలను ధ్వంసం చేసి గ్రామస్తులు భూమిని చదును చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో అటవీశాఖ రేంజ్ అధికారి, సెక్షన్ అధికారి తోపాటు ఇరువురు బీట్ అధికారులు గురువారం అర్ధరాత్రి అటవీశాఖ ప్రభుత్వ వాహనంలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అటవీ భూమిని ట్రాక్టర్ల సాయంతో చదును చేస్తున్న గ్రామస్తులను అడ్డుకునేందుకు ప్రయత్నించేందుకు పూనుకొని వారిని వారించే ప్రయత్నంలో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు అటవీశాఖ అధికారులపై కర్రలు, రాళ్లతో దాడికి తెగబడడంతో అనుకొని సంఘటన కు అధికారులు అక్రమార్కుల బారి నుండి తమ ప్రాణాలను కాపాడు కొనేందుకు అధికారులు పరుగులు పెట్టడంతో అక్రమార్కులు వారిని వెంబడిస్తూ చిత్రి యాల గిరిజనతండా వరకు గెదిమి దొరికిన వారిని దొరికినట్లు కర్రలతో దాడి చేశారు. చేసేది లేక అధికారులు తాము వచ్చిన వాహనం వరకు చేరుకొని వాహనంలో తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తుండగ కోపాద్రికులైన గ్రామస్థులు వాహనంపై సైతం దాడికి పాల్పడడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. దీంతో ఎలాగో అలా అధికారులు తప్పించుకొనిఎట్టకేలకు బయటపడ్డారు. ప్రస్తుతం మెదక్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement