Tuesday, November 19, 2024

గోతులు గుంతలతో కానుకుంట రోడ్డు అస్తవ్యస్తం…

ప్రభ న్యూస్ గుమ్మడిదల తొమ్మిదేళ్లుగా పల్లె గ్రామాలు అయినటువంటి కానుకుంట, రామిరెడ్డి భాయి, అనంతారం, మొల్ల గూడెం, ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యను పట్టించుకోకుండా ఇప్పుడు రోడ్డు వేస్తాం వెడల్పు చేస్తామంటూ హడావిడి చేసి గోతులు తవ్వి వదిలేసి నేడు ప్రమాదాలు జరుగుతుంటే కనీసం అటువైపు చూడని పరిస్థితి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిద్రావస్థకు నిదర్శనమని రాష్ట్ర భాజపా కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి విమర్శించారు.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో గుమ్మడిదల మండలం లోని కానుకుంట గ్రామం వెళ్లే రోడ్డు ను రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోడ్డును చూస్తుంటే చెరువులు మాదిరిగా ఉన్నాయని అస్తవ్యస్తంగా ఉన్నదని అనేకమంది ద్విచక్ర వాహనాల మీద పోతూ ప్రాణాలు పోగొట్టుకున్న ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. అదేవిధంగా చిన్నపాటి వర్షాలకే చెరువులుగా తయారై వ్యవసాయం మీద ఆధారపడే రైతులు నష్టపోతున్నారని అన్నారు.

- Advertisement -

అభివృద్ధి అభివృద్ధి అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ రోడ్డులను చూస్తుంటేనే అర్థమవుతుందని అన్నారు. గతంలో ఈరోడ్డు కోటి యాభై లక్షలు రూపాయల నిధులు మంజూరు అయినా ఇంకా ఏడున్నర కోట్లు జిఎంఆర్ నిధులతో ఖర్చుపెట్టి డబల్ రోడ్డు వేస్తానని వాగ్దానం చేయడం జరిగిందని ఇప్పటివరకు రోడ్డును ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. వెంటనే ఈ రోడ్డు వేయాలని భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేదంటే భారీ ఎత్తున ధర్నాకు దిగుతామని అని అన్నారు. పల్లె గ్రామాలు అంటే అక్కడి ప్రజలు అంటే చిన్నచూపు గా వారికి అనిపిస్తోందని విమర్శించారు. తొమ్మిదేళ్లుగా గుర్తురాని రోడ్డు ఎలక్షన్ల టైం లోనే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.

మీరు చేసే హైడ్రామా మొత్తం ఇక్కడికి ప్రజలు మహిళలు యువకులు గమనిస్తున్నారని త్వరలోనే సరైన బుద్ధి చెప్పే రోజు ముందుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల బిజెపి పార్టీ అధ్యక్షులు చింతల యాదగిరి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, రాఘవరెడ్డి, కానుకుంట గ్రామ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడు అంజిరెడ్డి, మండల మాజీ అధ్యక్షులు రాజిరెడ్డి, రామిరెడ్డి, భాస్కర్ గౌడ్ రామ్ రెడ్డి, ప్రశాంత్, శ్రీనివాస్ యాదవ్ భూత్ అధ్యక్షుడు యాదగిరి శ్రీనివాసరెడ్డి, బాల్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్ రాంబాబు భూపాల్ రెడ్డి యాదిరెడ్డి వీరారెడ్డి, జగన్ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement