సంగారెడ్డి పటాన్‌చెరుకు చెందిన మహమ్మద్ సమీర్ అహ్మద్(27) అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. చిన్ననాటి స్నేహితులే హత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. హత్యకు పాల్పడిన ఇలియాస్, రుస్తుం అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. సినీ ఫక్కీలో హత్య జరిగింది. మరి కాసేపట్లో విచారణ నిమిత్తం క్లూస్ టీమ్ తో సమాధిని తవ్వనున్నారు. హత్యకు ముందు సమీర్‌తోనే శ్మశాన వాటికలో గోయి తీయించి అదే చోట స్నేహితులు హత్య చేశారు. ఐదు రోజుల క్రితం బుధవారం రాత్రి ఒక పేద కుటుంబంలో చిన్న బాబు చనిపోయాడు. అతని కోసం సమాధి తవ్వాలని నమ్మించి సమీర్(మృతుని) తోనే గోయి తవ్వించి శుక్రవారం తెల్లవారు జామున పిలిపించి హత్య చేశాడని సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement