Tuesday, November 12, 2024

MDK: ప్రజలను మభ్య పెట్టేందుకే రాజీనామాల‌ చీకటి నాటకం… ర‌ఘునంద‌న్ రావు

నిజాంపేట, ఏప్రిల్ 26 (ప్రభ న్యూస్) : లోక్ స‌భ‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం రోడ్డు షో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రఘునందన్ రావును మండల బీజేపీ నాయకులు డోలు చప్పులు కోలాట ఆటపాటల మధ్య మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందే అన్నారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు లు లోక్ స‌భ‌ ఎన్నికలు సమీపిస్తున్నందున నేను రాజీనామా చేయాల్నా… నువ్వు రాజీనామా చేయాలనే దొంగ నాటకానికి తెర లేపుతున్న‌ట్టుందన్నారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకు చీకట్లో రాజీనామా అనే కొత్త నాటకానికి వెలుగులోకి తీసుకొస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను మర్చిపోయారన్నారు. మహిళలకు నాలుగు వేల పెన్షన్ అందిస్తామని చెప్పి ఉచిత బస్సు ప్రయాణం పేరిట అక్కాచెల్లెళ్లకు కయ్యం పెట్టారన్నారు. ఆగస్టు 15న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామనడం సిగ్గుచేటని, రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జనవరిలోనే రుణమాఫీ చేయొచ్చు కదా ఆగస్టు 15 ఎందుకు డెడ్ లైన్ విధించారని ప్రశ్నించారు. ఈ రుణమాఫీ కోసం ఏడుపాయల దుర్గామాత మీద ప్రమాణం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలపై దృష్టి సారించాలన్నారు. 10సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు రుణమాఫీ గురించి ఎందుకు ఆలోచించలేదన్నారు. రుణమాఫీ కోసం రాజీనామా చేస్తా అనడం దారుణమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీష్ రావులు తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలంటే కేవలం నరేంద్ర మోడీతోనే సాధ్యమని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ బలపరిచిన అభ్యర్థి రఘునందన్ రావుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల వార్డు మెంబర్లతోపాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బీజేపీ పార్టీలోకి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీజేపీ సీనియర్ నాయకులు, శ్రీనివాస్, తీగల శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, రాజిరెడ్డి, నరేష్ మహంకాళి, బీజేవైఎం ప్రశాంత్ గౌడ్, ఆకుల రమేష్, శంకర్, నవీన్, నీలం తిరుపతి, సంజీవులు, జాల పోచయ్య, జిపి స్వామి, గెరిగంటి బాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement