Tuesday, November 26, 2024

:సిద్దిపేట‌లో టెన్ష‌న్ .. ముగ్గురి అరెస్ట్ ..

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిన్న రాత్రి చత్రపతి శివాజీ విగ్రహంపై మూత్ర విసర్జన చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వెల్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణం లోని మధీన సమీపం లోకి ర్యాలీ రాగానే కొందరు వ్యక్తులు మజీద్ పై రాళ్లు విసిరారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తో పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. రాళ్లు విసిరడంతో మసీదులో ఉన్న వర్గం వారు కోపోద్రిక్తులై గేటులు తీసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని వారిని బయటకు రాకుండా అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు వర్గాల ఘర్షణతో గజ్వేల్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భాదితుల‌కు చికోటి ప‌రామ‌ర్శ
గజ్వేల్ పట్టణంలోని పిడిచేడ్ రోడ్డులో గల చత్రపతి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం నిన్న రాత్రి ఘర్షణలో గాయాల పాలైన సందీప్ అనే యువకుడిని ప‌రామ‌ర్శించారు చికొటి ప్రవీణ్ .. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఇలాంటి దాడులు జరిగితే చత్రపతి శివాజీ సాక్షిగా మేము ఊరుకోబోమ‌ని అన్నారు.. ఇంత అవమానం జరిగితే ఏ ఒక్క లీడర్ రాలేదంటూ వారికి ఓట్లు అడిగే హక్కు లేదని వ్యాఖ్యానించారు..

ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం – పోలీస్ క‌మిష‌న‌ర్ శ్వేత‌..

- Advertisement -

శివాజీ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై పలు సెక్షన్ల తో కేసు నమోదు చేశామ‌ని వెల్ల‌డించారు పోలీస్ క‌మిష‌న‌ర్ శ్వేత‌.. అలాగే సందీప్ ను గాయపర్చిన వ్యక్తుల పై సైతం కేసు నమోదు చేశామ‌న్నారు.. ఇప్ప‌టికే ముగ్గురిని అరెస్ట్ చేశామ‌ని వెల్ల‌డించారు.. వారిని కోర్టులో హాజ‌ర‌ప‌రిచ‌గా 14 రోజులు రిమాండ్ విధించార‌ని తెలిపారు.. ఈ ఘ‌ట‌నకు కార‌కులైన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టాబోమ‌ని, వీడియో ఫుటేజీ ద్వారా ఇన్వాల్వ్ అయిన గుర్తించి వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement