మనోహరాబాద్, ప్రభ న్యూస్ : వైద్యరంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ చొరవ వల్ల ముందుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన మనోహరాబాద్ లో రెండు కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గడిచిన ప్రభుత్వాల హాయాంలో 30% ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలతో పాటు డెలివరీలు జరిగాయన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామ గ్రామాన ప్రభుత్వ దావకానంలో మెరుగైన వైద్యంతో పాటు 70% డెలివరీలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులను నెలకొల్పామన్నారు. నిరుపేదలకు, సామాన్య ప్రజలకు 24గంటల పాటు వైద్య సేవలు అందుతున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక సర్పంచ్ చిటుకుల మహిపాల్ రెడ్డి, రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు, కాలకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, ఎంపీటీసీ లతా వెంకటేష్ గౌడ్, మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పురం మహేష్ ముదిరాజ్, జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా, అదనపు కలెక్టర్ రమేష్, గడ అధికారి మొత్తం రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.