మెదక్ : భక్తుల ఆరాధ్యదైవం కోరిన కోరికలు తీర్చే కొరమీసాల దేవుడు మల్లన్నస్వామి కృపా కటాక్షంతో ప్రతి పనిని ఇక్కడి నుంచే ముందుకు వెళ్తామని భక్తులు బహదూర్‌పల్లి వాసి లక్ష్మీనారాయణగౌడ్ తెలిపారు. మెదక్ మండలం మంబోజిపల్లి శివారులో కొయ్యగుట్టపై వెలసిన మల్లికార్జున స్వామి ఆలయంలో మెదక్‌తో పాటు హైద్రాబాద్ బహదూర్‌పల్లికి చెందిన లక్ష్మీనారాయణగౌడ్ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామికి ఒడిబియ్యంతో పాటు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిన కోరికలు తిరుస్తూ కొంగు బంగారంగా వెలసిన కొయ్యగుట్ట మల్లికార్జునస్వామిని దర్శించుకోవడం ప్రతియేడు ఇక్కడికి వస్తామని తెలిపారు. గత పది సంవత్సరాలుగా స్వామిని నమ్ముకొని పనులు నిర్వహిస్తే అన్నింటిలో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. కావున ప్రతియేడు స్వామికి బోనాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు మల్లన్నస్వామి మాట్లాడుతూ సంక్రాంతి నుండి ఉగాధి వరకు స్వామికి సత్యేడు వారాలు నిత్యపూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి గురువారం, ఆదివారం స్వామిని దర్శించుకునేందుకు వివిధ జిల్లాలు, ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. అలాగే ప్రతి పౌర్ణమి, అమావాస్యకు ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement