Tuesday, November 26, 2024

పటాన్ చెరులో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం

  • రాంరెడ్డిబావి గ్రామం నుండి యాత్రను ప్రారంభించిన కాట శ్రీనివాస్ గౌడ్
  • బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి కాట శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో చేరికలు

ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గుమ్మడిదల మండలం రాంరెడ్డిబావి గ్రామం నుండి హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించారు. ముందుగా గ్రామంలో శ్రీ పట్టాభిషేకయుక్త రామాలయంలో యాత్ర విజయవంతం కావాలని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి యాత్రను మొదలుపెట్టారు. ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు అధికారం కోసం చేస్తున్న మోసపూరిత హామీలు ప్రజలకు జరిగిన అన్యాయం గురుంచి వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని తెలియజేశారు. అలాగే రైతుల కోసం రూపొందించిన వరంగల్ రైతు డిక్లరేషన్ గురుంచి వివరించి, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, పార్టీ నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సింగల్ విండో మాజీ డైరెక్టర్ చంద్ర రెడ్డి, బొట్టు నరసయ్య, కిరణ్ రెడ్డి, స్వామి, శశి, నితిన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యువకులు కాట శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రెసిడెంట్స్ మద్ది వీరారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ రవీందర్ గౌడ్, సర్పంచ్ నీలమ్మ, ఎంపీటీసీలు గోవర్ధన్ గౌడ్, బొల్లారం కౌన్సిలర్ సంతోష లక్ష్మా రెడ్డి, నాయకులు ప్రతాప్ రెడ్డి, జయశంకర్ గౌడ్, దయాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, పుట్ట నర్సింగ్, కిష్టాగౌడ్, రవీందర్ గౌడ్, జైపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మల్లారెడ్డి, రవికాంత్ రెడ్డి, జితాప్ రెడ్డి, శంకర్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement