సంగారెడ్డి -: కిడ్నాప్ కు గురి అయిన 6 నెలల పాప కేసును పట్టణ పోలీసులు 24 గంటల్లో చేదించారు. నేరస్థుడిని పట్టుకుని, జుడిషియల్ రిమాండ్ కు పంపారు..-కిడ్నాప్ కి గురి అయిన పాప రూప ను తల్లిదందులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే ఆగస్టు 17 గురు గురువారం నాడు ఉదయం అందజ 10 గంటల సమయములో తూప్రాన్ గ్రామం, మండలం, మెదక్ జిల్లాకు చెందిన ఏసుమని భర్త వోళ్లపు రాజు వారి అనారోగ్య సమస్య ల దృష్ట్యా తమ ఇద్దరు పిల్లలతో కలిసి మోటార్ సైకిల్ పై సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు రావడం జరిగింది. రాత్రి అయినందున సంగారెడ్డి లోని పాత బస్ స్టాండ్ సమీపంలో గల గుంజి మైదాన్ కు వెళ్లి, అక్కడ కల్లు తాగి గుంజి మైదాన్ లోని గద్దె పై రాత్రి 10 గంటల సమయమున ఇద్దరు పిల్లలతో కలిసి పడుకున్నాడు . మరుసటి రోజు ఆగస్టు18 శుక్రవారం ఉదయం 5గంటలకు నిద్ర చూడగా, వారి చిన్న కూతురు రూప 6 నెలల పాప కనిపించలేదు. చుట్టూ ప్రక్కల వెతికి పోలీస్ స్టేషన్ కి వచ్చి పిర్యాదు చేశాడు.
, పట్టణ . ఇన్స్పెక్టర్ శ్రీధరరెడ్డి కేసు నమోదు చేసి క్లైమ్ టీం పేట్రోల్ మొబైల్ సిబ్బంది తో మూడు టీంలు గా ఏర్పడి సిసి ఫుటేజ్ ఆదారంగా వెతికి మన్నే అనిల్ ,, శ్రీశైలంలు ఈ నేరం చేసినట్లు గుర్తించారు.
. వివరాల్లోకి వెళ్తే . గత 07 సం.రాల క్రితం మన్నే అనిల్ పెళ్లి అయ్యి పిల్లలు కలగక పోవడం తో, ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుకోవాలనుకోగా, తన శ్రమ ఫలించలేదు. ఆగస్టు 17 గురువారం నాడు రాత్రి సమయం లో అనిల్ తన స్నేహితుడు శ్రీశైలం ఇద్దరు కలిసి మద్యం కొనుక్కుని గంజిమైదన్ గద్దె పై మద్యం సేవిస్తూండగా, పక్కనే నోళ్లవు రాజు ఏసుమని వాళ్ళ పిల్లలు కనిపించడంతో, ఎలాగైనా వాళ్ళు చిన్న పాపని ఎత్తుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉద్దేశాపుర్వకంగా వాళ్ళు నిద్రపోయిన తర్వాత పథకం ప్రకారం వోల్లెపు రాజు ఏసుమని చిన్న కూతురు రూప ని ఎత్తుకుని వెళ్ళినారు.
ఆగస్టు 19 శనివారం నాడు ఉదయం నేరస్తుడు అనిల్ ని సంగారెడ్డి పట్టణం లోని కింది బజార్, హన్మాన్ నగర్ హన్మాన్ టెంపుల్ సమీపం లో పట్టుకుని, కిడ్నాప్ కి ఉపయోగించిన మోటార్ సైకిల్ ని స్వాదనం పర్చుకుని నేరస్తుడ్ని పోలీస్ స్టేషన్ తీసుకురావైనది. పాప రూప ను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించనైనది. మరో నేరస్తుడు శ్రీశైలం పరారీలో ఉన్నాడు. నేరస్తుడు అనిల్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడం జరుగిందని మీడియా సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ రమేష్ కుమార్ తెలియజేశారు.