సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టుకు వదర తగ్గుముఖం పట్టింది. మొన్నటి దాకా ఎగువన కురిసిన వర్షాలు భారీగా ఇన్ ఫ్లో రాగా… వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ఉధృతి తగ్గిందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, గురువారం ఉదయం ఆరు గంటలకు వరకు ప్రాజెక్టులో 26.733 టీఎంసీల నీరు నిలువ ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టులోకి 4045 క్యూసెక్కుల నీరు వచ్చినట్లు నీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ నాగరాజు వెల్లడించారు. జులై నెలలోనే ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో 8.733 టీఎంసీల నీరు వచ్చి చేరిందన్నారు. కాగా, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉందని ఈఈ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement