Saturday, September 7, 2024

MDK: సిద్దిపేటకు జాతీయ స్థాయిలో గుర్తింపు సంతోషం.. మాజీ జెడ్పి చైర్ పర్సన్

సిద్దిపేట ప్రతినిధి: వినూత్న రీతిలో కొత్త పథకాలు పెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి భారత ఆర్థిక సర్వే లో సిద్దిపేటకు చోటుదక్కడం సంతోషంగా ఉందని మాజీ జెడ్పి చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. బుధవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… సిద్దిపేట్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకు గూర్చి సర్వే ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్లాస్టిక్ రహిత జిల్లా సిద్దిపేట లక్ష్యం హరిశ్ ఆలోచన అన్నారు. గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలో స్టీల్ బ్యాంక్ అడుగులు వేసి ప్లాస్టిక్ పదం లేకుండా చేసే ప్రయత్నం అన్నారు. క్యాన్సర్ నియంత్రణ కోసం దూరదృష్టితో స్టీల్ బ్యాంకు అంకురార్పణ ఎమ్మెల్యే హరీశ్ ప్రయత్నాలకు కేంద్రంలో గుర్తింపు వచ్చిందన్నారు.

హరితహారం ద్వారా పచ్చని జిల్లాగా ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు హరీశ్ దొరకడం సంతోషంగా ఉందన్నారు. 2014నుంచి ఇప్పటి వరకు 45 అవార్డులు వచ్చాయన్నారు. గత ఐదు ఏండ్ల కింద‌ పారిశుద్ధ్యం లోపంతో జిల్లా అస్తవ్యస్తంగా ఉండేది, అలాంటి సిద్దిపేట నేడు స్వచ్ఛంగా మారిందని, హరితహారం ద్వారా ఇంటికి మొక్కలు పంపిణీ, చెత్త సేకరణ ద్వారా జిల్లాల్లో ఇంటింటికి చెత్త బుట్టలు ఇచ్చి స్వచ్ఛతకు నిదర్శనం అయ్యిందని, ఆరోగ్యం కాపాడే ప్రయత్నాలు హరీశ్ రావు చాలా చేశారన్నారు.

జిల్లా పక్షాన హరీశ్ రావుకు కృతజ్ఞత లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగుతామన్నారు. డ్వాక్రా సంఘాలకు ఆర్థిక బలోపేతం కోసం ప్రయత్నాలు. జిల్లాలో కుటీర పరిశ్రమలు, పచ్చళ్ళ తయారీ. స్టీల్ బ్యాంక్ తదితర అంశాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహితంగా పట్టణాలు, గ్రామాలు అనేది కేవలం నినాదం కాదు ఆచరణలో అది అమల్లోకి తెచ్చిన ఘనత హరీశ్ రావుకే దక్కుతుందన్నారు. సిద్దిపేట గడ్డ పేరు మరింత ఇనుమడింప చేసిన ప్రతి ఒక్కరికీ, డ్వాక్రా మహిళలకు అభినందనలు తెలిపారు. సిద్దిపేట స్టీల్ బ్యాంకు అన్ని రాష్ట్రాల్లో ఆదర్శమ‌ని జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని సమిష్టి కృషితో జాతీయ స్థాయిలో సిద్దిపేటకు పేరు వ‌చ్చింద‌న్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోహన్ లాల్, గుండు భూపేష్, పాల సాయిరాం, ఎడ్ల సోమిరెడ్డి, కనకయ్య, మాజీ సర్పంచ్ లు ఆంజనేయులు, రవి గౌడ్, నరేష్ గౌడ్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement