Tuesday, November 26, 2024

పది ఫలితాల్లో సిద్దిపేట జిల్లాకు ద్వితీయ స్థానం

ప్ర‌భ న్యూస్‌, సిద్దిపేట ప్ర‌తినిధి : విద్యా క్షేత్రంగా విరాజిల్లుతూ.. అన్నింటిలో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట జిల్లా 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన సిద్దిపేట జిల్లా ఈ ఏడు రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే గత పదవ తరగతి ఫలితాల్లో వరసగా రెండవ, మూడవ, మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణతలో గత సంవత్సరం కంటే ఈఏడు 1.4 శాతం అధికంగా సాధించారు. జిల్లాలో 14, 177 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 13,985 మంది విద్యార్థులు పాస్ కాగా 98.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 7,053 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 6,927 ఉత్తీర్ణత (98.21శాతం) సాధించారు. అదే విధంగా బాలికల విభాగంలో 7,124 విద్యార్థినీలు పరీక్ష రాయగా 7,058 విద్యార్థినీలు ఉత్తీర్ణత (99.07 శాతం) సాధించారు. పదవ తరగతి ఉత్తీర్ణతలో బాలురతో పోలిస్తే బాలిక హవా కొనసాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement