సిద్దిపేట : జిల్లా కేంద్రమైన హౌసింగ్ బోర్డు కాలనీలో వెంకీ పింకీ జంప్ సినిమా షూటింగ్ ప్రారంభం కార్యక్రమంలో రాష్ట్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. మొదటి షాట్ కోసం క్లాప్ కోట్టగా ఏంపి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ మేరకు శ్రీ లక్ష్మీ నర్సింహ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో నిర్మాణ వెంకట్, అజయ్ నతారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మొత్తం తెలంగాణ యాస, భాషలో మీ ముందుకు రానున్నదని మంత్రి హరీష్ చెప్పారు. రెండు నెలల పాటు సిద్దిపేట పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరగనున్నదని కళాంజలి రాజేష్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న చిత్రాన్ని తెలంగాణ సమాజం ఆదరించాలని కోరారు. కార్య క్రమంలో మున్సిపాల్ చేర్మన్ రాజనర్సు హీరో విక్రమ్, హీరోయిన్లు ,ఇతర నటీనటులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement