సిద్దిపేట అర్భన్, (ప్రభ న్యూస్): గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా 2022-23 సంవత్సరానికి ఆశ్రమ పాఠశాల బోయినపల్లి నందు వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించడం జరిగిందని వాటర్ స్పోర్ట్స్ లో గిరిజన బాల, బాలికలకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఫిరంగి ఒక ప్రకటనలో తెలిపారు. కామకింగ్, కేనోఇంగ్, సెయిలింగ్ తదితర క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వాటర్ స్పోర్ట్స్‌లో ప్రవేశం పొందేందుకు విద్యార్థినీ విద్యార్థుల ఎత్తు, బరువు స్టాండింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంపు, మెడిసిన్ బాల్ త్రో 30 మీటర్ల ప్లయింగ్ స్టార్ట్, 800 మీటర్ల పరుగు పందెం పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిభ ఆధారంగా ఐదవ తరగతిలో 20 మంది బాలికలకు, 20 మంది బాలురకు ప్రవేశం కల్పిస్తామని అన్నారు.
శిక్షణ సమయంలో బాల, బాలికలకు ప్రత్యేకమైన వసతి, ఆహారం, స్పోర్ట్స్ దుస్తులు, షూస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నాలుగో తరగతి పాసై ఐదవ తరగతి చదువుతున్న ఆసక్తిగల విద్యార్థులు రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, బోనఫైడ్ ఆధార్ కార్డు జిరాక్స్ కాఫీలతో హాజరుకావాలన్నారు.. మండల స్థాయి ఎంపికలు 05.07.2022 నుండి 08.07.2022 వరకు,. జిల్లాస్థాయి ఎంపికలు 13.07.2022 నుండి 15.07.2022 వరకు, తుది ఎంపిక 18.07.22 నుండి 22.07.2022 వరకు స్పోర్ట్స్ స్కూల్ హకింపేట హైదరాబాద్ లో జరుగుతాయన్నారు. మరిన్ని వివరాలకు సంగారెడ్డిలోని గిరిజన అభివృద్ధి అధికారిని సంప్రదించాలని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.