Friday, November 22, 2024

వర్షంతో కూలిన ఇళ్లను పరిశీలించిన సర్పంచ్ వీరస్వామి గౌడ్

మండల కేంద్రమైన హత్నూర గ్రామంలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షం వల్ల గ్రామంలోని బ్యాగరి అశోక్, కొండగళ్ల పెద్ద భాగయ్య, కొండగళ్ల రుక్కమ్మ కొండే గల్ల లత ఇండ్లు కూలిపోయాయి. దీంతో సర్పంచ్ వీరస్వామి గౌడ్, వార్డు సభ్యులు ఆసిఫ్, నర్సింలు, ఖదీర్, శ్రీకాంత్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్, నాయకులు పెంటేష్, వెంకటేశం గౌడ్, తదితరులు పరిశీలించి బాధితులను ఓదార్చారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో అధికారులు దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం అందిస్తామని సర్పంచ్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement