సంగారెడ్డి జిల్లా : డ్రైవర్‌ను చితకబాదిన ఘటనపై సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. దాడికి పాల్పడిన కానిస్టేబుల్ రాములు, హోంగార్డు బాలరాజుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏఎస్ఐ దుర్గయ్య, కానిస్టేబుల్ ప్రసాద్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో వాహనాల తనిఖీ సమయంలో బండిని ఆపమంటే ఆపలేదన్నకోపంతో డ్రైవర్ వాజీద్‌ను పోలీసులు విచక్షణారహితంగా చితకబాదడతో బాధితుడు కుప్పకూలిపోయాడు.ఈ తతంగాన్ని వాహనదారులు వీడియో తీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సదాశివపేట అయ్యప్పస్వామి గుడి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.ఆ సమయంలో సదాశివపేటకు చెందిన వాజిద్ తన బొలెరో వాహనంతో కిరాయికి వెళ్తున్నాడు. వేగంగా వెళ్తున్న సమయంలో పోలీసులు సడెన్‌గా బండిని ఆపాలని సూచించడంతో వాజిద్ బండిని కాస్త ముందుకు వెళ్లి ఆపాడు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుళ్లు లాఠీతో వాజిద్‌ను తీవ్రంగా కొట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement