చేగుంట : రైతులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తేనే వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అభివృద్ది చెందుతాయని రెడ్డిపల్లి సొసైటీ ఛైర్మన్ మ్యాకల పరమేష్ అన్నారు. ఇందులో సభ్యత్వం పొందిన వారికి రుణాలు ఇవ్వడం జరుగుతుందని, కొంతమంది రైతులు రుణం తిరిగి చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని పరమేష్ పేర్కొన్నారు. వరికోత అనంతరం రుణాలు చెల్లించాలని పిలుపునిచ్చారు. దీర్ఘకాలిక రుణాలు స్వల్ప రుణాలు చెల్లించి సకాలంలో రుణం పొందే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పరమేష్ కోరారు. రెడ్డిపల్లి సొసైటీ పరిధిలో వల్లూరు, బీమరావుపల్లి, రుక్మాపూర్, రెడ్డిపల్లి, పొలంపల్లి గ్రామాలు ఉన్నాయి. పొలంపల్లి గ్రామంలో మేల్ ఫిమేల్ వరినాట్లు ఎక్కువ ఉన్నందున పొలంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదన్నారు. మిగతా సెంటర్ అన్ని సొసైటీ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని పరమేష్ తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రాలు సిద్దం చేస్తున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement