సిద్దిపేట జిల్లాలో రైతుబంధు పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు 8 విడతలుగా 3 లక్షల 10 వేల 709 మంది రైతుల ఖాతాల్లో 2 వేల ఒక వంద 49 కోట్ల 25 లక్షల 45 వేల 412 రూపాయలు జమ అయ్యాయని జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు తెలిపారు. జిల్లాలో తొలి విడతలో 222 కోట్ల 40 లక్షల 55 వేల ఐదు వందల రూపాయలు, రెండవ విడతలో 221 కోట్ల 44 లక్షల 98 వేల 580 రూపాయలు, మూడవ విడతలో 268 కోట్ల 14 లక్షల 24 వేల 542 రూపాయలు,
నాలుగవ విడతలో 203కోట్ల 22 లక్షల 83 వేల 96 రూపాయలు, ఐదవ విడతలో 302 కోట్ల 59 లక్షల 8 వేల 452 రూపాయలు, ఆరవ విడత లో 305 కోట్ల 87 లక్షల 19 వేల 9 వందల 25 రూపాయలు, ఏడవ విడతలో 305 కోట్ల 82 లక్షల 47 వేల 211 రూపాయలు, ఎనిమిదవ విడతలో 319 కోట్ల 74 లక్షల 8 వేల 106 రూపాయలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే రైతు బంధు పథకం ద్వారా తెలంగాణలో మొత్తం రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. కేవలం నాలుగేండ్లలో రైతులకు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి సాయం అందజేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కలెక్టర్ ఎం.హనుమంత రావు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital