సదాశివపేట రూరల్: రహదారులపై పోలీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్ననకిలీ ముఠాని అరెస్టు చేసినట్టు సదాశివపేట పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి డి ఎస్పి రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంజోల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్, అతని స్నేహితుడు మాణిక్యo కలిసి హైదరబాద్ నుంచి తన స్వగ్రామానికి టూ వీలర్ పై అర్థరాత్రి వెళ్తున్నారు. సదాశివపేట మండల పరిధిలోని ఎం అర్ ఎఫ్ పరిశ్రమ వద్దకు రాగానే కొంతమంది వారి స్కూటీని అడ్డగించారు. పోలీసుల పేరు చెప్పి, సారు రమ్మన్నారని బెదిరింపులకు పాల్పడ్డారు. వారిపై దాడికి దిగి, 2000 వేల నగదు, పోన్ దొంగలించారు.
అనంతరం వారు తెచ్చుకున్న కారులో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు సదాశివపేట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నేరస్తులు మహామ్మద్ ఖలీం పాషా, పెడ్డగొల్ల వినొధ్ కుమార్, సయ్యేద్ ఇమ్రాన్, అబ్దుల్ జకీర్ ను అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులకు రివార్డు అందజేస్తామని డీఎస్పీ చెప్పారు.