Friday, November 22, 2024

రిక్షావాలా.. బతుకు డీలా..

మెదక్ : ట్రింగ్.. ట్రింగ్ అంటూ గంటల మోతలు.. సైడ్ సైడ్ అంటు కేకలు.. ఐదారుగురు ప్రయాణికులు కూర్చుంటే కిటకిటలాడే గూడు (టా ప్)రిక్షాను తొక్కుకుంటు వీధుల్లో సందడి చేసే కార్మికులు.. బంధువులు స్నేహితులు ఊల్లాకు వస్తున్నారంటే ముందుగానే బస్టాండ్ రైల్వే స్టేషన్ కు చేరుకునే కార్మికులు వారిని రీక్షాల్లో ఎక్కించుకుని.. యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఊరి విశేషాలు చెబుతూ కొత్త సమాచారం వింటూ గమ్యస్థానాలకు చేర్చే వారు ఆసుపత్రులు ఆఫీసులకు చేరుకోవాలన్న అందరికీ అందుబాటులో ఉండే రిక్షా కార్మికులు ఆ రోజుల్లో పొద్దంతా చెమటోడిస్తే 200కు పైగా సంపాదించే వారు. కానీ పరిస్థితి మారిపోయింది. గూడు రిక్షాలు గోడు చెప్పుకుంటున్నాయి. ఆధునిక సమాజంలో కార్మికులు పొద్దంత పడిగాపులు కాసినా.. సాయంత్రానికి కూడా అంతంతమాత్రంగానే ప్రయాణికులురిక్షా ఎక్కేందుకు వస్తున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు పెరగడంతో రిక్షాలను ఆశ్రయించే వారు కరువయ్యారు. కార్మిక కుటుంబాలు పూట గడవక పస్తులు ఉండాల్సిన పరిస్థితులు చేసేది లేక రిక్షాగుడును తొలగించి ప్లాట్ ఫామ్రీక్షగా మార్చి వస్తువులను చేరవేసేందుకు వినియోగిస్తున్నారు. భారంగా బతుకుబండి లాగిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో సుమారు మూడువేల గూడు రీక్షలు ఉండేవని తెలుస్తోంది. ప్రస్తుతం అవి వందలకు చేరినట్లు సమాచారం. ఒకప్పుడు మెదక్, రామాయంపేట, తూప్రాన్, చేగుంట తదితర పట్టణము లో సుమారు వందల సంఖ్యలోగూడు రిక్షాలు ఉండగా.. ఇప్పుడు సంఖ్య మూడు నాల్గుకు చేరింది. నేటి కంప్యూటర్ యుగంలో రీక్షలు ఎక్కేందుకు ప్రయాణికులు మొగ్గు చూపడం లేదు. దీంతో రిక్షా తొక్కే కార్మికులు తమ జీవనోపాధి కోసం గూడు రిక్షాలను తొలగించి బతుకు చిత్రాన్ని మార్చుకుంటున్నారు. కాగా రామాయంపేట లో ఉన్న నలుగురు గూడు రిక్షా కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరక్షించినప్పటికీ ప్రయాణికులు రిక్షా ఎక్కక పోవడంతో దిక్కు తోచని స్థితిలో ఖాళీ జోబు లతో ఇండ్లకు చేరుకుంటున్నారు. ఒకప్పుడు పట్టణాల్లో ఓ వెలుగు వెలిగిన కార్మికులు ప్రస్తుతం పొట్ట చేతబట్టుకొని పనుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో లో ఏయ్ రిక్షా.. అనే పిలుపు వినపడగానే పదుల సంఖ్యలో వచ్చి రిక్షా కార్మికులు వారిని చుట్టే ముట్టేవారు. ఇక్కడికి వెళ్ళండి అంటూ ఆప్యాయంగా అడిగేవారు. రోడ్లపై ఉన్న ఎత్తుపల్లాలను అధిగమిస్తూ చెమటోడుస్తున్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే వారు. ఆనాడు వచ్చే రూ.200 సంపాదనతో ఇంటిల్లిపాది కడుపునిండా భోజనం చేసేది. మారుతున్న పరిస్థితుల వల్ల మార్కెట్ లోకి ఆటోల ప్రవాహము పెరగడంతో రిక్షాల వైపు కన్నెత్తి చూసేవారు. కరువయ్యారు. వడియారం, అక్కన్నపేట, రైల్వే స్టేషన్ లు. వివిధ పట్టణాల్లోని బస్టాండ్ ప్రాంతాల్లో గూడు రిక్షాల స్టాండ్ ఒకప్పుడు కలకలలాడుతూ ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గిపోవడంతో రిక్షా వర్కర్స్ యూనియన్ సెంటర్ బోసిపోతోంది. వారి కుటుంబ పోషణ కోసం పడరాని పాట్లు పడుతున్నారు దశాబ్దాలుగా రిక్షాల లే నమ్ముకుని జీవిస్తున్న ఇటువంటి కార్మికులకు ప్రభుత్వం రుణాలు వారికి మరో ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.

రిక్షా కార్మికుడు జలగడుగుల సిద్ధరాములు
బేరాలు అసలే లేవు, కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. కొన్నేళ్లుగా రిక్షా తొక్కుతున్న. అప్పట్లో రీక్షాకి మంచి డిమాండ్, గౌరవం ఉండేది. రాను రాను రిక్షా కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది.కూలి కోసం రోజంతా పడిగాపులు కాయాల్సి వస్తుంది. ప్రభుత్వం రిక్షా కార్మికులను ఆదుకోవాలి.డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement