సంగారెడ్డి : 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ టి.ఉషావిశ్వనాథ్ జాతీయ జండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయగీతాలాపన చేసారు. అనంతరం సంగారెడ్డి జిల్లా ప్రజలందరికి 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. 1950 జనవరి 26న భారత రాజ్యాగం అమలులోకి వచ్చిందని, అప్పటినుండి ప్రతి సంవత్సరం ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. భారత రాజ్యంగ రచనలో అంబేద్కర్ కృషి మరువలేనిదని, భారత రాజ్యంగ విశిష్టతను ప్రతి పౌరుడు తెలుసుకొని, మహనీయుల భాటలో నడవాలని, ప్రతి ఒక్కరు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ దేశ ప్రగతికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీంద్రారెడ్డి, యన్.జనార్ధన్ ఎఆర్ డీఎస్పీ, మహేష్ గౌడ్, ఎస్.బి.ఇన్స్పెక్టర్స్ లాలూ నాయక్ , డి.సి.ఆర్.బి. ఇన్స్పెక్టర్ జెలెందర్ రెడ్డి, ఆర్.ఐలు కృష్ణ, డానియల్, రామరావ్, యస్.బి., డిసిఆర్బి ఎస్ఐలు, సూపరింటెండెంట్ లు అశోక్, వెంకటేశం, డీపీవో ప్రెసిడెంట్ నాగరాజు, జిల్లా పోలీసు సంఘం ప్రెసిడెంట్ దుర్గారెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement