సిద్దిపేట : ఉద్యోగుల విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వమని, రాష్ట్రంలో విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని కొందరు కూహానా మేధావులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో పీఆర్టీయూఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని, త్వరలో రిక్రూట్మెంట్ భర్తీ పూర్తి చేస్తామన్నారు. త్వరలో ఎంప్లాయీస్ హెల్త్ కార్డు విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో అనేక వైద్య విద్య కోర్సులు ఉంటాయని, డాక్టర్లు నర్సులు బీఫార్మసీ, ఎం ఫార్మసీ, దంత వైద్య కోర్సులు ఇలా అనేకమైన కోర్సుల్లో విద్య అందించేలా ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రం వచ్చిన నాడు ఎంబీబీఎస్ సీట్లు 850 మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 2950కి పెరిగాయన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement