దుబ్బాక : దుబ్బాక సర్కారు దవాఖానాల్లో మరో అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం డక్కపల్లి గ్రామానికి చెందిన ఉలి సుజాత గత రెండు సంవత్సరాల నుండి కడుపు నొప్పితో బాధపడుతూ అనేక ఆసుపత్రిలు తిరిగి ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రి వెళ్లింది. అక్కడి PHC డాక్టర్ ధర్మ దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు చేసిన తర్వాత రక్తం గ్రూప్- B నెగిటివ్ అని నిర్ధారణ అయింది. రక్తం 9 గ్రాములు అంటే 2 రక్తం ప్యాకెట్లు తెప్పించి మా వైద్య సిబ్బంది రక్తం ఎక్కించినారు. ఈరోజు డాక్టర్ హేమరాజ్ సింగ్ 18x12x12 సెంటిమీటర్ల సర్వైకల్ ఫైబ్రాయిడ్ గడ్డను తొలగించడం జరిగింది. సుజాత ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి ఆపరేషన్లు దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల ఆపరేషన్లు చేస్తునం చుట్టూ ప్రక్క జిల్లాలు, గ్రామాల ప్రజలు దుబ్బాక ఆసుపత్రికి వచ్చి మా సేవలను పొందగలరని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ అన్నారు. సిబ్బంది డాక్టర్ బల్బీర్ సింగ్, మత్తు డాక్టర్ రాఘవేందర్ ,స్టాఫ్ నర్సులు రేణుక ,ధనలక్ష్మి , ఆరోగ్య శ్రీ సిబ్బంది శ్రీహరి ,కుమార్ ,నవీన్ , థియేటర్ సిబ్బంది కమలాకర్, శ్రీనివాస్ ,లావణ్య పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ ఆరోగ్య శ్రీ కింద చేయడం జరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement