మెదక్ : కరోనా రెండవ దశ విస్తృతంగా వ్యాపిస్తున్నందున మనల్ని మనమే కాపాడుకోవాలని, ఇందుకు మాస్కు ధరించడం ఒక్కటే మార్గమని జిల్లా కలెక్టర్ యస్. హరీష్ అన్నారు. టీకాపై అపోహలు వీడి ప్రతి ఒక్కరు తప్పక టీకా వేయించుకోవాలని అదే మనకు శ్రీరామరక్ష అని, లేకుంటే ప్రాణానికే ముప్పని ప్రజలకు సూచించారు. కలెక్టరేట్‌లో వైద్యశాఖ ఏర్పాటు చేసిన కోవిడ్ శిబిరంలో కలెక్టరేట్‌కు వచ్చిన సందర్శకులకు రాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 115 మంది సందర్శకులకు వివిధ కార్యాలయాల సిబ్బందికి రాపిడ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటీవ్ రాగా వారిని ఆస్పత్రిలో వైద్యంకై సిఫారసు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా వేస్తున్నామని, 45 సంవత్సరాలు పైబడిన వారందరూ విధిగా టీకాలు వేసుకోవాలని, టీకాకు వైరస్‌ను అడ్డుకునే శక్తి ఉంటుందని అన్నారు. రెండు డోసులు తీసుకున తర్వాత శరీరంలో యాంటి బయోటిస్ శక్తి పెరుగుతుందని కాబట్టి ఎటువంటి సంశాయాలకుక తావివ్వకుండా నేడే టీకా వేయించుకకోవాలని అన్నారు. అలాగే అవసరమైతే తప్ప బయట ఎక్కువ తిరగరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement