Tuesday, November 26, 2024

DYFI: సదాశివపేట్ లో రావూస్ స్కూల్ ని సీజ్ చేయాలి

సదాశివపేట రూరల్ : పర్మిషన్ లేకుండా సీబీఎస్ ఇంటర్నేషనల్ పేరుతో అడ్మిషన్లు దండుకుంటూ విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటున్న రావూస్ స్కూల్ ని సీజ్ చేయాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిప్యూటీ డీఈవో విజయ కి శుక్రవారం డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ… సదాశివపేట పట్టణంలో రాసి స్కూల్ కి సీబీఎస్ కి పర్మిషన్ లేకుండా నడిపిస్తూ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో అడ్మిషన్లు దండుకుంటూ జీవో నెంబర్ ఒకటి 1, 91 ప్రకారం ఫీజులు తీసుకోకుండా విచ్చలవిడిగా ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.

స్కూల్ నడిపిస్తూనే పై అంతస్తు కూల్చివేస్తూ భవన నిర్మాణాన్ని కొనసాగిస్తూ, మరోపక్క విద్యాబోధన జరిపిస్తున్నారన్నారు. దీంతో విద్యార్థులకు ప్రమాదం జరిగే అవకాశముందని, ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. అలాగే అర్హత లేని టీచర్లతో విద్యాబోధన బోధిస్తూ విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. పాఠశాలకు గ్రౌండ్ కూడా లేకుండా నడిపించడం సిగ్గుమాలిన పని, ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసిన డీఈఓ ఆదేశాలు ఇస్తేనే దానిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి చొరవ తీసుకొని స్కూల్ ను సీజ్ చేయాలని, లేనియెడల ఉద్యమాలు చేపడతామని, కమిషనర్ కు సీబీఎస్ బోర్డుకి ఫిర్యాదు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement