శివ్వంపేట : ఎంతో శ్రమించి పంటలు పండించిన రైతులకు లాభం చేయాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని జడ్పీటిసి పబ్బ మహేష్‌గుప్త, పీఏసీఎస్ ఛైర్మన్ చింతల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సొసైటీ వైస్‌ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి వారు మండలంలోని మల్లుపల్లి, గుండ్లపల్లి, కొంతాన్‌పల్లి, పోతులబొగుడ, ఉసిరికపల్లి, రత్నపూర్, పిల్లుట్ల, రూప్లాతాండలో పీఏసీఎస్, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటిసి మాట్లాడుతూ కరోనా ఇబ్బందులు ఉన్నాగాని రైతు సంక్షేమం గురించి ఆలోచించి కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోందని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం సొసైటీ ఛైర్మన్ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని, ఎవరి ప్రమేయం లేకుండానే రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులు జమ అవుతాయన్నారు. పిల్లుట్ల గ్రామంలో సర్పంచ్ పెద్దపులి రవి ఆధ్వర్యంలో జడ్పీటిసి, సొసైటీ ఛైర్మన్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాలలో తహశీల్దార్ భానుప్రకాష్, సర్పంచులు పెంజర్ల శ్రీనివాస్‌యాదవ్, గ్యాదరి భాగ్యమ్మ, ఎడ్ల హరికిషన్‌రావు, తలారి శివులు, బాబురావు, బొగ్గుల సాలమ్మ, పెద్దపులి రవి, మాలోతు మోతీ, ఎంపిటిసిలు మర్రి సత్తిరెడ్డి, ఆకుల ఇందిర శ్రీనివాస్, వాణి రాంమోహన్‌రెడ్డి, సీనియర్ నాయకులు గొర్రె వెంకట్‌రెడ్డి, చింతస్వామి, బోళ్ల సదానందం, గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు మాధవి, సీఏ చంద్రకళ, రాజశేఖర్‌గౌడ్, వెంకటేష్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement