Saturday, November 23, 2024

రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలు..

కొండపాక : యాసంగి పంటకాలంలో పండించిన ధాన్యాన్ని విక్రయించడంలో రైతులకు కష్ట నష్టాలు కలుగకుండా చూసుకునే ఉద్దేశ్యంతో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీపీ ర్యాగళ్ళ సుగుణ తెలిపారు. జప్తినాచారం, గిరాయిపల్లి తదితర గ్రామాల్లో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు. ఇదిలా ఉండగా వెలికట్ట గ్రామంలో స్థానిక సర్పంచ్‌ అమ్ముల రమేశ్‌, సింగిల్‌విండో డైరెక్టర్‌ సురేందర్‌రావులు సంయుక్తంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అంకిరెడ్డిపల్లిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్‌ బడేకోల్‌ లావణ్య నర్సింలు ప్రారంభించారు. దుద్దెడ గ్రామంలో ఏర్పాటుచేసిన కొనుగోలుకేంద్రాన్ని సర్పంచ్‌ మహదేవ్‌, ఎంపీటీసీ బాలాజీ, ఉపసర్పంచ్‌ శివకుమార్‌ తదితరులు ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పీఏసీఎస్‌ సీఈఓ రాజు, వ్యవసాయాధికారి ప్రభాకర్‌రావు, ఏపీఎం శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రామేశ్వర్‌, నాయకులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement