నర్సాపూర్ మే 10 (ప్రభ న్యూస్) : రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పసుపు జెండా ఎగరవేయడం ఖాయమని
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని టిడిపి పోలిటి బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, టిడిపి రాష్ట్ర నాయకులు కాసాని వీరేశం అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాసాని వీరేశం లు మాట్లాడుతూ.. తెలుగుజాతి ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు తెలియజేసిన గొప్ప మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించి ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ మొట్టమొదటిగా వృద్ధాప్య పింఛన్లు మహిళలకు ఆస్తిలో సగభాగం రెండు రూపాయలకు కిలో బియ్యం మహిళా యూనివర్సిటీ ఏర్పాటు వైద్య ఆరోగ్య యూనివర్సిటీ లను ఏర్పాటు చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించారన్నారు. ఢిల్లీలో తెలుగు ప్రజలను మదరాశి అనేవారని ఎన్టీఆర్ వచ్చిన అనంతరం తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింపజేసి తెలుగు ప్రజలకు ఢిల్లీలో మంచి గుర్తింపుని తెచ్చారని అన్నారు. అంతేగాక పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి మండలాల ఏర్పాటు ప్రజల వద్దకు పాలన ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టాడన్నారు.
టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆధ్వర్యంలో హైదరాబాదు నగరం ఐటీ రంగంలో ఎంతో అభివృద్ధిని సాధించిందని అన్నారు. ఆనాటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులే నేడు కనిపిస్తున్నాయని అన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవం తీసుకువచ్చి 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్దులు కావాలన్నారు తెలుగుదేశం పార్టీకి ప్రజల అండదండలు ఉండాలని వారు కోరారు. ఈ మహానాడులో 8 తీర్మానాలు చేశామని అట్టి తీర్మానాలను ఈనెల 27 28 తేదీలలో రాజమండ్రిలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు సభలో అందరి ఆమోదంతో తీర్మానం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు చరితా రెడ్డి, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జోస్న, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకే గంగాధర్, మెదక్ పార్లమెంటు అధ్యక్షులు రమేష్, నర్సాపూర్ నియోజకవర్గ కన్వీనర్ రమణారావు సాయన్న జయరాం స్వామి గౌడ్ ఆప్తర్ కృష్ణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు