సంగారెడ్డి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంపై దృష్టి సారించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి (88) దరఖాస్తులను కలెక్టర్ శరత్ అదనపు కలెక్టర్లు రాజర్షి, వీరారెడ్డిలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి పెట్టుకున్న అర్జీలను వేగవంతంగా పరిష్కరించడంపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఆయా అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు ఇచ్చి, ఆయా శాఖల అధికారులు అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, తమ పరిధిలో పరిష్కరించ గలిగినవి వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం కానట్లయితే అందుకు కారణం సంబంధిత అర్జీదారుకు స్పష్టంగా వివరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణికి సంబంధించిన ఆయా శాఖల రిజిస్టర్ లలో అప్ డేట్ చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదన్నారు. రెవెన్యూ, వ్యవసాయం, ఉద్యాన, మార్క్ ఫె డ్,ట్రాన్స్ కో, పంచాయతి, విద్య, వైద్య ఆరోగ్యం, పశు సంవర్డక, బిసి, గిరిజన, వికలాంగుల సంక్షేమం, హౌసింగ్, పిసిబి, జిల్లా గ్రామీణాభివృద్ధి, సంగారెడ్డి మున్సిపల్ శాఖలకు అర్జీలు వచ్చాయి. భూ సమస్యల పరిష్కారం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరీ, ఆసరా పింఛన్లు, స్వయం ఉపాధి కల్పనకు రుణం మంజూరీ, ఉపాధి చూపాలని, పిడుగు పాటు కు మరణించిన మేకలకు నష్ట పరిహారం ఇప్పించాలని, ఫ్రీడం ఫైటర్ కేటగిరీలో ఇస్తున్న పించన్ ఆగిపోయిందని, తిరిగి పునరుద్ధించాలని, తదితరాలపై అర్జీ దారులు దరఖాస్తులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజార్షి షా, వీరారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ ఒ, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement