సంగారెడ్డి, నవంబర్ 10 (ప్రభ న్యూస్) : ట్రాఫిక్ సిబ్బంది రక్షణార్ధమై జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ పొలరైస్డ్ సన్ గ్లాసెస్, బాడిఓన్ కెమెరాలను అందజేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ… జిల్లా పోలీస్ సిబ్బంది మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించడంలో ఈ పొలరైస్డ్ సన్ గ్లాసెస్ ఎంతగానో ఉపయోగపడతాయని, సిబ్బందిని ఎండా, వానల నుండి రక్షిస్తూ, సూర్య కిరణాలు నేరుగా కండ్లపై పడినా, ఈ సన్ గ్లాసెస్ దరించినందువలన చూపు క్లియర్ గా ఉంటుందన్నారు.
బాడీ ఓన్ కామెరాలు ధరించి వాహనదారుల ఫోటోలు ఆటోమేటిక్ క్యాప్చర్ చేయడం, వీడియోలు రికార్డ్ చేయడం జరుగుతుందన్నారు. సంగారెడ్డి, పటాన్ చెర్వు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 60మంది సిబ్బందికి పొలరైస్డ్ సన్ గ్లాసెస్, బాడీఓన్ కెమెరాలను అంధించడం జరిగిందన్నారు. వాహన దారులు, పాదచారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలను ఇచ్చినట్లైతే సంబంధిత తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డా.పి.అశోక్, యస్.బి ఇన్ స్పెక్టర్ శివలింగం, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నాగరాజు, ఆర్.ఐ.రాజశేకర్ రెడ్డి, ఆర్.యస్.ఐ. మహేశ్వర్ రెడ్డి, సంగారెడ్డి, పటాన్ చెర్వు సిబ్బంది ఉన్నారు.