ఉమ్మడి మెదక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ రీజియస్ లో 16మంది ఉద్యోగులకు సూపర్ వైజర్ గా పదోన్నతులు లభించాయి. మెదక్ రీజియన్ లో 25సంవత్సరాల నుండి కండక్టర్లుగా, డ్రైవర్లుగా సర్వీసు చేస్తున్న 16 మంది కండక్టర్లు/డ్రైవర్లు కు సూపర్ వైజర్ పోస్టులకు క్వాలిఫై అయ్యారు. వీరిలో 13మంది కండక్టర్లు, ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు. పదోన్నతి పొందిన ఉద్యోగులకు రీజినల్ మేనేజర్ అభినందనలు తెలిపారు. వారికి ఆర్డర్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధికి, మెదక్ రీజియన్ ను ముందంజలో తీసుకురావడానికి కృషి చేయాలని సూచనలు చేశారు. పదోన్నతి పొందిన వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, చాలా సంవత్సరాలుగా సంస్థలో తమ విధులను అంకితభావంతో నిర్వహించడం వలన తమ పిల్లలు మంచి స్థాయికి ఎదిగారని ఆనందం వ్యక్తం చేసారు.
ఈ పదోన్నతులు తమ అదృష్టంగా భావిస్తూ ఉద్యోగ సోదరులు/సోదరిమణులు అందరూ అంకితభావంతో పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. పదోన్నతి పొందిన ఉద్యోగి బి.బి.కె.రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కండక్టర్ గా చేస్తూ పిల్లలకు కాలేజ్ లో మాజీ రాష్ట్రపతి డా.ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ చెప్పిన “కలలు కనండి… కలలను సాకారం చేసుకోనే వరకు శ్రమించండి” అనే నినాదంతో పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతూ చదివించానని పలితంగా ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. మంచి స్థాయిలో ఎదిగారని సంతోషాన్ని వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సుదర్శన్, డిప్యూటీ రీజినల్ మేనేజర్స్ దైవాదీనం, జ్యోస్న, పర్సనల్ ఆఫీసర్. సుజాత, అసిస్టెంట్ పర్సనల్ మేనేజర్ సంపత్ కుమార్, డిప్యూటీ సూపరిండెంట్ యస్.వెంకటేశం పాల్గొన్నారు.