మనోహరాబాద్ : ప్రైవేట్ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆసరాగా నిలుస్తూ ఉచితంగా సన్నబియ్యం, నగదు పంపిణీ చేస్తుందని ఎంపిపి పురం నవనీత రవి ముదిరాజ్, కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేష్, ఎంపిటిసి నత్తి లావణ్య మల్లేష్ ముదిరాజ్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు మూసివేయడంతో వారి ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలో రూ.2వేలు నగదుతో పాటు 25 కేజీల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. మేజర్ గ్రామపంచాయతీ కాళ్లకల్ గ్రామంలో మొత్త 4 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా 15 మంది టీర్లను గుర్తించి స్థానిక రేషన్ దుకాణంలో ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, డీలర్లు తదితరులున్నారు.
ప్రైవేట్ టీచర్లకు ఉచిత బియ్యం..నగదు..
By sree nivas
- Tags
- cash
- manoharabad
- medak live news
- medak local news
- praivate teachers
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- today online news
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement