Wednesday, November 6, 2024

పామాయిల్‌ తోటలను పరీశీలిస్తున్న ప్రజా ప్రతినిధులు.. రైతులు..

తొగుట : భద్రాది కొత్తగూడెం జిల్లాలో పామాయిల్‌ తోటలను పరీశీలిస్తున్న తొగుట మండల ప్రజా ప్రతినిధులు రైతులు పామాయిల్‌ తోటల పెంపకం కోసం సీఎం కేసీఆర్‌ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌ రావు పార్లమెంట్‌ సభ్యులు కోత్త ప్రభాకర్‌ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తొగుట మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు రైతులు తెలిపారు. సీఎం కేసీఆర్‌.. మంత్రి తన్నీరు హరీష్‌ రావు ఎంపీ కోత్త ప్రభాకర్‌ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని వివిద గ్రామాల రైతులు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఆయిల్‌ పేడ్‌ సంస్థ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయిల్‌ పామ్‌ పంటలను పరిశీలించారు. తోగుట రైతులు ఆశ్వరావుపేట మండలంలోని నారావారి గూడెం జమ్మిగూడెం అశ్వరావుపేట గ్రామాల్ల్లో ఆయిల్‌ పామ్‌ పంటలను పరిశిలించారు. రాష్ట్ర ఆయిల్‌ పామ్‌ పెడరేషన్‌ అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్‌కు చెందిన 105 ఎకరాల్లో సాగు చేసిన ఆయిల్‌ పామ్‌ పంటను చూసి రైతులు ముచ్చట పడ్డారు ఆయిల్‌ ఫామ్‌ సాగు చేసిన రైతులు కోనేటి పురుషోత్తం కె సత్యనారాయణ, హరిబాబు, తోట మల్లపరాజు, వెంకటేశ్వర్లు తదితర రైతులు ఆయిల్‌ పామ్‌ పంట ప్రయోజనాలు వివరించారు. ఆయిల్‌ పామ్‌ సాగు చేసిన 4 ఏళ్ల వరకు అంతర పంటలు సాగుచేసుకోవచ్చని వివరించారు 4 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల వరకు రైతుకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సాధించవచ్చని వివరించారు. చాలా మంది రైతులు వరి పంట స్థానంలో ఆయిల్‌ పామ్‌ను సాగు చేస్తున్నారని ఎకరా వరి పంటకు ఖర్చు అయ్యే నీటిలో 4 ఎకరాలు ఆయిల్‌ పామ్‌ పంట సాగు చేయవచ్చని వివరించారు. ఆయిల్‌ పామ్‌ పంటకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు అనంతరం ఆయిల్‌ కర్మాగారంను నర్సరీని పరిశిలించారు. ఈ కార్యక్రమంను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ మంత్రి హరీష్‌ రావు గారికి కోత్త ప్రభాకర్‌ రెడ్డి గారికి వారు ధన్యవాదాలు తెలిపారు. మండలంలో పెద్ద ఏత్తున ఆయిల్‌ పామ్‌ పంటలను సాగు చేస్తామని వారు పెర్కోన్నారు కార్య క్రమంలో తొగుట వైస్‌ ఎంపీపీశ్రీకాంత్‌ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కంకణాల నరసింహులు సర్పం చ్‌ బోడ్డు నర్సింలు రైతుబందు అధ్యక్షులు బోదనం కనకయ్య, సత్తయ్య, జర్నలిస్టులు జీడిపల్లి రామ్‌ రెడ్డి, ఉల్లేనగల సాయి నాయకులు లక్ష్మారెడ్డి, రగోతం రెడ్డి, పబ్బతి శ్రీనివాస్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement