Friday, July 5, 2024

MDK: బైక్‌ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు..

సంగారెడ్డి, జులై 2 (ప్రభ న్యూస్) : విపరీతమైన ధ్వని పుట్టించే బైకర్ల సైలెన్సర్లపై సంగారెడ్డి ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వాహనదారులు సైలెన్సర్లతో అధిక శబ్దాలు చేస్తే.. వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా పలు వాహనాల సైలెన్సర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఆదేశాల మేరకు సంగారెడ్డి టౌన్ లో ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది కలిసి అధిక శబ్దం చేసే సైలెన్సర్లు గల వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

ప్రజలకు, తోటి వాహనదారులకు అసౌకర్యం కలిగిస్తూ ధ్వని కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు ఉన్న వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు ఇకపై వర్జినల్ సైలెన్సర్లనే ఉపయోగించాలని ఎస్పీ రూపేష్ అన్నారు. సైలెన్సర్ తీసేసి వాహనాలు నడుపుడుతున్న వారిపై కేసులు పెడతామని, వాహనాలకు ఇటువంటి సైలెన్సర్లను విక్రయించే షాపుల యజమానులు, వాటిని బిగించే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత నియమాలను పాటించాలని పోలీసులు సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement