సిద్దిపేట : పోలీస్ ఉద్యోగం కోసం కష్టపడేవారు కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ప్రతిఒక్కరు తపనతో ప్రాక్టీస్ చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేటలోని మల్టీపర్పస్ హైస్కూల్లో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు జరుగుతున్న ఉచిత శారీరక దృఢత్వ శిక్షణ కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం కోసం కష్టపడి సాధన చేయాలన్నారు. ప్రభుత్వం తరుపున మీకు అండగా నిలుస్తామన్నారు. పోలీసు ఉద్యోగం సాధించాలనుకునేవారు కేసీఆర్ ఉచిత శిక్షణ ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. నిష్ణాతులైన పీఈటీలతో అభ్యర్థులకు క్రమం తప్పకుండా సరైన శిక్షణ ఇప్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఎంతమంది ఉంటే అంతమందికి మంచి పౌష్టికాహారాన్ని, శిక్షణను అందింలాన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement