Monday, November 18, 2024

MDK: భారీ వర్షాలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలి… ఎస్పీ చెన్నూరి రూపేష్

జిల్లా ప్రజలు అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి
అత్యవసర సమయంలో డైల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712656739 నంబర్ ను సంప్రదించండి
సంగారెడ్డి, జులై 20 (ప్రభ న్యూస్): రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన దృష్ట్యా సంగారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగిందని, జిల్లా ప్రజలు ఎవ్వరు కూడా అత్యవసరమైతేనే తప్ప ప్రయాణాలు చేయకూడదని ఎస్పీ చెన్నూరి రూపేష్ సూచించారు.

జలాశయాలు నిండుకుండలా మారే అవకాశం ఉన్నందున ప్రమాద కారణాల దృష్ట్యా ఎవ్వరూ చెరువులు, కుంటలను చూడటానికి వెళ్లరాదని సూచించారు. ఏదైనా ప్రమాదం తలెత్తినా, అత్యవసర సమయంలో స్థానిక పోలీసు స్టేషన్ కు లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739 ను సంప్రదించవలసిందిగా జిల్లా ఎస్పీ సిహెచ్ రూపేష్ సూచించారు.

జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు కుంటలకు వెళ్ళకుండా ప్రమాద సూచిక బోర్డ్ లను ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. యస్.హెచ్.ఓ. లు ప్రత్యేకంగా తమ తమ ఏరియాలో ఉన్న చెరువులు, కుంటలు, ఆనకట్టలు ప్రమాదం అంచున ఉన్నట్లయితే సమాచారం అందించాలన్నారు.

- Advertisement -

భారీ వర్షాల దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలు..
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. ప్రమాద కారణాల దృష్ట్యా చెరువులు, కుంటలను చూడటానికి వెళ్లరాదు. రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి. విద్యుత్ స్తంభాలను కానీ, వైర్లను కానీ చేతులతో తాకకూడదు. నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లరాదు. వాగులు, వంకలు, బ్రిడ్జీలపై నుండి పొంగి, ప్రవహించే సమయంలో దాటడానికి ప్రయత్నించరాదు. పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల పక్కన నివాసం ఉండరాదు. జిల్లా పోలీసు అధికారులకు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement