Wednesday, November 20, 2024

హరితహారానికి ప్రణాళిక రెడీ.. సిద్దిపేట జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణలో మొత్తం భూ భాగంలో 33 శాతం మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. తెలంగాణకు హరితహారం ఎనిమిదో విడత కార్యక్రమానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్‌ ప్రారంభించనుండగా, అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు ఏర్పాట్లు- చేస్తున్నారు. ఈ సంవత్సరం సిద్దిపేట జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, అంతకు మించి నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉంచారు. ప్రధానంగా నీటి పారుదల రంగంపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ఎక్కువగా జిల్లాలో ఉన్న కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల కాల్వల గట్లపై మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. జూన్‌ నెలలో వర్షాలు పడగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నారు.

2015 సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలు, పట్టణాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటింది. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ స్థలాల్లో వివిధ రకాల మొక్కలు నాటడంతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఏ గ్రామానికి వెళ్లినా పచ్చదనం స్వాగతం పలుకుతున్నది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు- చేశారు. ఆ గ్రామానికి సరిపడా మొక్కలను అక్కడి నర్సరీలోనే పెంచి ఇంటింటికీ 6 మొక్కలు అందజేస్తున్నారు. జిల్లాలో 499 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయి. ఈ మొక్కలు ఎక్కడికి అవసరం ఉంటే అక్కడికి పంపడంతో పాటు- రోడ్లకు ఇరువైపులా, అటవీ ప్రాంతాల్లో నాటు-తున్నారు.

పెరిగిన పచ్చదనం..

హరితహారం అమలు తర్వాత పల్లె, పట్టణం అని తేడా లేకుండా అంతటా పచ్చదనం పెరిగి పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. మొక్కలతో నీడ, స్వచ్చమైన గాలి ఆహ్లాకరమైన వాతావరణం ఏర్పడింది. హరితహారంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి కొత్త శోభను సంతరించుకున్నాయి. మున్సిపాలిటీలు, కొన్ని గ్రామ పంచాయతీల్లో హరితహారం కింద నాటిన మొక్కలను తొలగిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు.

ఎనిమిదో విడత లక్ష్యం 40 లక్షల మొక్కలు
ఈసారి జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటనున్నారు. ప్రభుత్వ స్థలాలు, విద్యాసంస్థలు ఇలా ప్రతిచోట మొక్కలు నాటు-తారు. ఎనిమిదో విడత హరితహారంలో ప్రధానంగా నీటిపారుదల (భారీ, మధ్యతరహా) రంగంలో గల కాలువలకు ఇరువైపులా ఎక్కువగా మొక్కలు నాటనున్నారు.

- Advertisement -

పక్కా ప్రణాళికతో సిద్ధం : డీఆర్డీఏ పీడీ గోపాల్‌
ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నది. నాటిన ప్రతి మొక్కనూ కాపాడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఎనిమిదో విడత హరితహార కార్యక్రమం కింద జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టు-కున్నాం. డిఆర్డీఓ ద్వారా 23 లక్షల 60 వేల మొక్కలు, జిల్లాలోని ఐదు మున్సిపాలిటీ-ల పరిధిలో 26 లక్షల 40 వేల మొక్కలు నాటు-తాం. బీటీ- రోడ్లకు ఇరువైపులా మల్టీ లెవెల్‌ అవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టనున్నాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement