Tuesday, November 26, 2024

రామక్క పేటలో వసతి గృహానికి శాశ్వత భవనం : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక నియోజకవర్గం రామక్క పేట గ్రామంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కు వసతి గృహ శాశ్వత భవనం నిర్మిస్తున్నట్లు, దాని నిర్మాణం కొరకు రూ.కోటి రూపాయలు మంజూరు అయినట్లు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం విద్యాక్షేత్రం తీర్చి దిద్దాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు కృషితో ముందుకు పోతున్నామని చెప్పారు. దుబ్బాకలో రాష్ట్రంలోనే మోడల్ గా సీఎం కేసీఆర్ చదివిన స్కూల్ ను అద్భుతంగా నిర్మించి ఆదర్శంగా నిలిచామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యను అమలు చేసి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఆ దిశగా మన దుబ్బాక నియోజకవర్గంలోని రామక్క పేట గ్రామంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో ఇది వరకు వసతి గృహం లేకుండే తాత్కాలిక భవనంలో వసతి ఉండే.. శాశ్వత భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని మంత్రి హరీష్ రావు దృష్టి కి తీసుక పొగ కోటి రూపాయలతో వసతి గృహానికి శాశ్వత భవనం మంజూరు చేసిన మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భవనం నాలుగు రూమ్స్ తో ఆధునిక హంగులు కార్పోరేట్ స్ధాయిలో నిర్మాణం కానుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి హరీశ్ రావుకి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement