అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై మెదక్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ అధికారులు ప్రజలకు సేవలందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement