Saturday, November 23, 2024

మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట : ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి

తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి అన్నారు. శనివారం పోచారం చెరువులో 6 లక్షల 28 వేల రొయ్యలు ,12 లక్షల 48 వేల చేప పిల్లలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి అధికారులతో కలిసి వదిలారు. మత్స్య కారుల అభివృద్ధికి, ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చొరవతో మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీసి వర్షపు నీటిని ఒడిసి పట్టడం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా చెరువులను నింపడం ద్వారా మత్స్య సంపదను పెంచి చరిత్రను తిరగ రాశారని అన్నారు. జిల్లాలో ఘనపూర్‌, కొంటూర్‌, హల్దీ వాగు వంటి చెరువులతో పాటు చెక్‌ డ్యామ్‌ లు ఉన్న దగ్గర 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలను పెంచుతున్నారని ఆమె వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement