ఉమ్మడి కరీంనగర్ : పరీక్షలు సోమవారం ప్రశాంతంగాప్రారంభమైనాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు ఉండటంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు 9 గంటల లోపే చేరుకున్నారు. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు కుదించారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 40 వెలమండికి పై గా పరీక్షలకు హాజరైనారు.
ఉమ్మడి మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో 271 పరీక్ష పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో 46,306 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల ఆవరణలో అంటించిన తమ హాట్ టికెట్ నెంబర్ ను పరిశీలించుకుని తమకు కేటాయించిన రూమ్ కు వెళ్లి పరీక్ష రాస్తున్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించారు.