నిజాంపేట,ఫిబ్రవరి28(ప్రభన్యూస్): మండల పరిధిలోని చల్మెడ గ్రామం లో వరి పంటకు నీరు లేక భూమి బీటలు వారి ఎండిపోతుంది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావుల నుంచి నీరు రాక వరి పంట ఎండిపోతుందని రైతు ఆకుల మహేందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వ కాలేశ్వరం కాలువల ద్వారా చెరువులకు నీరు అందించడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రైతుల పంట పొలాలు ఎండిపోకుండా గ్రామంలోని చెరువులో నుండి నీటి విడుదల చేసినట్లయితే రైతులు వేసిన వరి పంట పొలాలు ఎండిపోకుండా ఉంటాయన్నారు.