Saturday, November 23, 2024

హత్య కాదు.. యాక్సిడెంట్ : ఎస్పీ రోహిణి ప్రియ‌ద‌ర్శిని

నర్సాపూర్ : యువత మద్యానికి బానిస‌ కావద్దని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. కౌడిపల్లి వద్ద ఈ నెల 22న జరిగిన రోడ్డు ప్రమాదం గురించి నర్సాపూర్ పోలీసుస్టేషన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంగా రెడ్డి జిల్లా కల్పగూర్ గ్రామానికి చెందిన చింతల మనోహర్, పవన్ కుమార్, వెంకట్రామ్ ముగ్గురు ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్ వెర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. అంత ముప్పై సంవత్సరాల లోపువారే. మద్యం ఫుల్ గా తాగి మద్యం మత్తులో కారు నడుపుతూ సంగారెడ్డి నుంచి నర్సాపూర్ కు వచ్చారు. నర్సాపూర్ లో ఆగి బిర్యాని తిని సిద్ధిపేటలో మిత్రుడి ఇంటి నిర్మాణ పనులను చూడటానికి బయలు దేరారు. కౌడిపల్లి వద్ద పాపన్నపేట్ మండల చికొడు గ్రామానికి చెందిన లింగంపల్లి రాజు 32 రోడ్డుపై కూర్చున్నాడు. మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ రాజును ఢీ కొట్టగా.. అక్కడికక్కడే మృతి చెందారు. అదే వేగంతో కారును ముందుకు నడిపారు. రాజు శరీర భాగాలు తుకుతుకు అయ్యాయి. కొద్ది సేపటికి కారును మల్లుపుకొని వచి చూసి అలాగే ముందుకు పోయారు. దీని పోలీసులు అక్కడ ఉన్న అనవలను చూసి హత్య కేసుగా నమోదు చేశారు.

ఈ హత్యను చేధించడంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డితో పాటు సీఐ షేక్ లాల్ మదర్, కౌడిపల్లి ఎస్ఐ శివ ప్రసాద్ రెడ్డి తమ సిబ్బంది తో సీసీ కెమెరాల ఆధారంగా ఛేదించారు. మొదటగా కారు నెంబరును తెలుసుకొని కారు యజమాని అల్వాల్ సత్యనారాయణ ను విచారించగా ఈ కేసు వివరాలు పూర్తిగా తెలుసుకొని చింతల మనోహర్, పవన్ కుమార్, వెంకట్రామ్ ను విచారించగా ఈ కేసు ఛేదించడం జరిగింది. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ షీక్ లాల్ మదర్, ఎస్ఐ శివ ప్రసాద్ రెడ్డి, పోలీస్ సిబ్బంది రాము, బాగయ్య, పోచయ్య, రాజు, దుర్గ రెడ్డి, ఎస్.కె.అలీలను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement