రామచంద్రాపురం : దేశ ఆర్థిక ప్రగతిలో ఈశాన్య రాష్ట్రాలది కీలకపాత్ర అని, మిజోరాం శాంతియుత రాష్ట్రం, అశాంతి హింసకు తావులేదని మిజోరం గవర్నర్ హరిబాబు అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర నాయకులు గోదావరి అంజిరెడ్డి నివాసానికి మిజోరం గవర్నర్ హరిబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కొండ ప్రాంతాల్లో ఉన్న మిజోరం ఇప్పుడిప్పుడే దేశంలోని అన్ని రాష్ట్రాలతో అనుసంధానాన్ని ఏర్పాటు చేసుకుంతోందన్నారు. అన్ని రాష్ట్రాలకు మిజోరం నుంచి రైల్వే లైన్ పనులు ప్రారంభమయ్యాయి.. 2023 డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు. మిజోరం ప్రజల సౌకర్యార్థం పదివేల కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. కళాధాన్ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం ద్వారా రహదారుల అనుసంధానం జరుగుతోందన్నారు. మిజోరం ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ చర్చలు జరుపుతూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. మిజోరం రైతులు వర్షాధార పంటలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు.
దేశ ఆర్థిక ప్రగతిలో ఈశాన్య రాష్ట్రాలది కీలకపాత్ర : మిజోరం గవర్నర్ హరిబాబు
Advertisement
తాజా వార్తలు
Advertisement