చేర్యాల : టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిపెస్టోలో పెట్టిన విధంగా నిరుద్యోగ యువతకు తక్షణమే నిరుద్యోగభృతి 3016 రూపాయలు అందించాలని ఏఐవైఎఫ్ మండల మహాసభలు స్థానిక పట్టణ కేంద్రంలోని షాదీఖానా ఫంక్షన్ హాల్ లో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రజినీకాంత్ రెడ్డి, అధ్యక్షతన కనుకుంట్ల శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కేవలం ఏన్నికల సమయంలో మాత్రమే అధిక మొత్తంలో డబ్బులు పంచుతూ నోట్లు వెదజల్లి ఓట్లు కోనుగోలు చేసి నిరుద్యోగ యువతను నిండా ముంచుతుందని మండిపడ్డారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు రాక ఉపాధి లంక ఉన్నత చదువులు చదివిన యువత ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలే అని వారు అన్నారు.ఈ నెల 5న సిద్దిపేట పట్టణంలో జరిగే ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఐవైఎఫ్ రాష్ట్ర కమీటి సభ్యులు అందె అశోక్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నూకల రజీనీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement