- పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు
- మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాం
- ఈ సేవలు ఇలాగే కొనసాగాలి
- ఆత్మీయ సమ్మేళనంలో నీలం మధుతో కాలనీల వాసులు
మీ సేవలు ఇతరులకు స్ఫూర్తి దాయకం.. ఇతరులకు సేవా చేయాలనుకునే మంచి మనస్సున్న వారు ఈ రోజుల్లో అరుదుగా ఉంటారు.. మీరందిస్తున్న ఆపన్న హస్తం ఎందరో నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తున్నది… మీలాంటి వారు మాకు అత్యంత సన్నిహితులు కావడం చాలా సంతోషంగా ఉన్నది… మీరు మాకు దగ్గరివారు అని గర్వంగా చెప్పుకుంటున్నామని పలు కాలనీలకు చెందిన వారు కొనియాడారు.. వారి మాటల్లోనే…
ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్ : మీ సేవలు స్పూర్తి దాయకమని.. మిమ్ముల్ని ఆదర్శంగా తీసుకుంటున్నామని రామచంద్రాపురం మండలం తెల్లాపూర్, ఇంద్రానగర్, బీహెచ్ఈఎల్ లోని న్యూ ఎంఐజీ కాలనీలకు చెందిన వారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ను కొనియాడారు. కాలనీ వారంతా శుక్రవారం మధును ఆత్మీయంగా కలుసుకున్నారు. ఆ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. మీ సేవలు ఇతర ప్రాంతాల్లో కూడా చర్చకు వస్తున్నాయని, తాము ఎక్కడికి వెళ్లిన నీలం మధు తమ ఆత్మీయుడని చెప్పుకుంటున్నామన్నారు. రోజు వారిగా ఏదో ఓ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారని, తామంతా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నామన్నారు. సాయం కావాలని వచ్చిన వారికి తోచిన సాయం అందించడంతో పాటు తల్లిదండ్రుల పేరున ఎన్.ఎం.ఆర్ సంస్థను ఏర్పాటు చేసి సేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. మీ ఆదర్శవంతమైన సేవలు ఇలాగా కొనసాగాలని, తామంతా మే వెంట ఉంటామన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని వివిద గ్రామాల దేవాలయాల నిర్మాణానికి విరాళాలు అందిస్తూ భక్తి భావం పెంపొందించడంలో కూడా ఎంతో కషి చేస్తున్నారన్నారు. ఈ రోజుల్లో సేవభావం కలిగిన వారు ఎక్కడో ఓ చోట కనిపిస్తున్నారని, నీలం మధు రూపంలో మాకు మా పక్కనే ఉండడం సంతోషంగా ఉందన్నారు. వేలకోట్ల ఆస్తులున్నవారు కూడా చిల్లిగవ్వ దానం చేయడానికి, సేవ చేయడానికి ముందుకు రారని, మీరు మాత్రం మీకున్నదాంట్లో తోచిన సాయం అందిస్తుండడం ఎంతో గొప్పది అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో మాకు ఓ ఆత్మీయ, ప్రజా సేవకులు ఉన్నారని మీ పేరు చెప్పుకుంటున్నామని ఆయా కాలనీల వాసులు నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. ఈ సమావేశంలో పి పాండు, టీ మధుసూధన్, రవి చారి,రాజు గౌడ్, తూర్పు శ్రీను, శేఖర్, ఉప్పరి రవి, పి రాజేష్, జీ గోపాల్, డి వెంకట్ రెడ్డి, కే శ్రీను, టి రాజు, పి నవీన్ యాదవ్, టి ప్రభాకర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.