ఉమ్మడి మెదక్ బ్యూరో : అంటరానితనాన్ని రూపుమాపి అన్నివర్గాల సమానత్వం కోసం జాతిని జాగృతం చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మెదక్ కాంగ్రెస్ సీనియర్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని చిట్కుల్ లోని ఆయన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజంలో అసమానతలు తొలగించి, ప్రతి ఒక్కరికీ సమానత్వం, సౌబ్రాతృత్వం, రిజర్వేషన్లు అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అన్నివర్గాల వారికి సమన్యాయం జరగాలనే తలంపుతో రాజ్యాంగాన్ని రూపొందించాడని తెలిపారు. సమాజంలో సామాజిక అసమానతలు రూపుమాపితేనే అభివృద్ధి పథంలో పయనిస్తామని నమ్మి ఆనాడే రాజ్యాంగంలో బడుగు వర్గాలకు ప్రాధాన్యతనిచ్చిన అంబేద్కర్ ఆశయ సాధనకు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.